Sunday, December 22, 2024

నరేంద్రమోడీ తన ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డ్ ఇచ్చారు

- Advertisement -
- Advertisement -

రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అసదుద్దీన్

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియమైన ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డు ఇచ్చారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. మొహ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి గత ఏడాది పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన ఎంఎల్‌ఎ రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఉపసంహరించుకున్న దరిమిలా ఓవైసి ఎక్స్ వేదికగా స్పందించారు. పధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపిలో విద్వేషపూరిత ప్రసంగం అత్యంత వేగవంతమైన మార్గమని ఆయన విమర్శించారు. నూపుర్ శర్మ కూడా ప్రధానమంత్రి నుండి ఆశీస్సులు పొందుతారని వ్యాఖ్యానించారు.

బిజెపిలో ‘ప్రమోషన్‌కు విద్వేషపూరిత ప్రసంగం అత్యంత వేగవంతమైన మార్గం’ అని ఓవైసి అన్నారు. రాజా సింగ్ గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానంగా ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొని బిజెపి అధిష్టానం అతనిపై సస్పెన్షన్ ను ఉపసంహరించుకుంది. గత సంవత్సరం ఆగస్టులో, రాజా సింగ్ ఒక వీడియోలో ఇస్లాం, మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అతడిని అరెస్టు చేశారు. అయితే, తెలంగాణ హైకోర్టు నవంబర్ 2022లో అతనిపై ప్రయోగించిన పీడీ యాక్టును రద్దు చేసింది. అనంతరం రాజాసింగ్‌కు బెయిల్ మంజూరైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News