Sunday, January 19, 2025

శివాజీ ధైర్యసాహసాలు, పాలన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి: మోడీ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: శివాజీ ధైర్యసాహసాలు, పాలన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సాధారణంగా మన్‌కీ భాత్ నెల చివరి ఆదివారం ఉంటుందని, వచ్చే ఆదివారం తాను అమెరికాలో ఉంటున్నందున ముందే వచ్చానని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం కంటే మెరుగైంది ఏముంటుందన్నారు. బిపార్‌జాయ్ తుపాను నుంచి కచ్ ప్రజలు త్వరగా కోలుకుంటున్నారని, ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు చాలా మంది కృషి చేస్తున్నారని, తమ శక్తిమేరకు కృషి చేస్తున్నట్లు ఎంతోమంది లేఖలు రాశారని ప్రధాని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బండా జిల్లా వాసి తులసీరామ్ యాదవ్ కూడా లేఖ రాశారాని, యుపిలోని హపూర్ జిల్లాలోని అంతరించిన నదిని పునరుద్దరించారని, కష్టతరమైన సవాళ్లను కూడా సమిష్టి కృషితో పరిష్కరించవచ్చన్నారు.

Also Read: 100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News