న్యూయార్క్ : నాలుగు రోజుల అమెరికా పర్యటనకు వె ళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్‌లో టెస్లా సిఇఒ ఎ లాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పా టు చేయాలని భావిస్తున్న తరుణంలో మస్క్, ప్రధాని మ ధ్య సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత మస్క్ మాట్లాడుతూ,- ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. టెస్లా త్వరలో భారతదేశంలోకి ప్రవేశిస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నానని, వచ్చే ఏడాది(2024)లో భారతదేశాన్ని సందర్శించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రధానికి తమకు సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు, త్వరలో భారత్‌లో తమ ప్రణాళికపై ప్రకటన చేస్తామని అన్నారు. మీడియా కథనాల ప్రకారం, టెస్లా అధికారులు మే 17న భారత ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. గత సంవత్సరమే టెస్లా భారతదేశానికి రావాలని ప్రయత్నించింది, అయితే పూర్తిగా అసెంబుల్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని టెస్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇది ఒక కొలిక్కి రాలేదు.
స్థానిక ప్రభుత్వాలను అనుసరించాల్సిందే..
ట్విట్టర్ మాజీ సిఇఒ జాక్ డోర్సీ భారత ప్రభుత్వంపై చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా ఎలాన్ స్పందించారు. ‘వేరే దారి లేదు, స్థానిక ప్రభుత్వాలను అనుసరించాల్సిందే. లేదా మూసివేసేందుకు సిద్ధం కావాలి’ మస్క్ అన్నారు. మస్క్ ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేయగా, దీనికి కొత్త సిఇఒని కూడా నియమించారు. ఎలాన్ మస్క్ గతంలో భారత్‌లో చెలరేగిన వ్యవసాయ చట్టాల వివాదంపై స్పందిస్తూ, ఏ దేశమైనా స్థానిక చట్టాలను అనుసరించి పనిచేస్తామని, వివిధ ప్రభుత్వాలకు చట్టాలు, నిబంధనలు కూడా భిన్నంగా ఉంటాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా స్పందించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.