Saturday, December 21, 2024

నేడు మోడీ పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

రాత్రి 7.15గం.లకు ప్రధాని
సహా పలువురు కేంద్ర
మంత్రులుగా ప్రమాణం
ప్రత్యేక అతిథులుగా పొరుగు
దేశాల అధినేతలు
ముస్తాబైన రాష్ట్రపతి భవన్..
ప్రమాణ స్వీకారం తరువాత
ఆహ్వానితులకు ముర్ము విందు

న్యూఢిల్లీ : దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఆదివారం (నేడు) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన ది మోడీ 3.0 ప్రభుత్వం కానుంది. దేశ తొలి ప్ర ధాని జవహర్‌లాల్ నెహ్రూ తరువాత మూడోసా రి కూడా ప్రధాని పీఠం అధిష్టించే వ్యక్తి మోడీనే . లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఈసారి అతి పెద్ద మెజార్టీ సంఖ్యాబలం గల పార్టీగా బిజెపి అవతరించింది. కూటమిలోని ఇతర పార్టీల సంపూర్ణ మద్దతుతో కేంద్రంలోకి మరోమారు మోడీ ప్రభు త్వం వస్తోంది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్ర త్యేక ఏర్పాట్ల నడుమ ఆదివారం రాత్రి 7గంటల 15 నిమిషాలకు మోడీ, మంత్రిమండలిలోకి ఎం పికయ్యే ఇతరులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్ర మాణం చేయిస్తారు.

ఈ విశేష ఘట్టానికి తరలివ చ్చే ఏడు ఇతర దేశాల నేతల పేర్లను శుక్రవారం ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రకటించింది. పొరుగుదేశాలు, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ ముయిజ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ ఈ కార్యక్రమానికి అతిధులుగా వస్తున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గాయ్ , ఉపాధ్యక్షులు సెషిలెస్ అహ్మద్ కూడా తమ ఆ హ్వానానికి సమ్మతి తెలిపారని కూడా వెల్లడించా రు.ఎనిమిది వేల మంది ఆహ్వానితులుగా వస్తా రు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వందేభారత్ రైలు తొలి మహిళా పైలట్ సురేఖా యాదవ్ కూ డా హాజరవుతారు.సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన శ్రామికులు, పారిశుద్ధ కార్మికులు, ట్రాన్స్‌జెండర్లను కూడా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ లే ఖలు పంపించారని అధికారులు తెలిపారు.

ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పలు టీవీఛానల్స్ సిద్ధం అయ్యాయి. ఆదివారం నాటి ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్రపతి ముర్ము తరఫున నేతలు, ఆహ్వానితులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మాల్దీవుల అధ్యక్షులు ము యిజ్ ప్ర ధాని మోడీ ప్రమాణస్వీకారానికి రానుండటం ప్ర త్యేకతను సంతరించుకుంది . ఆ యన భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారనే విషయం , ఇందుకు అనుగుణం గా కొన్ని చర్యలకు దిగడం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమానికి రావడం దౌత్యపరమైన మలుపు కానుంది. దేశ రాజధానిలో కొత్త సర్కారు కొలువు దీరుతున్న దశలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఢిల్లీని నో ఫ్లైయిం గ్ జోన్‌గా ప్రకటించారు. ప్రధాన రహదారులలో భా రీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News