Sunday, December 22, 2024

రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు

- Advertisement -
- Advertisement -

బెల్గావి:  ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటకలోని బెల్గావి ర్యాలీలో ఆదివారం ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. భారత రాజులు చేసిన దౌర్జన్యాలపై రాహుల్ గాంధీ మాట్లాడతారు, కానీ నవాబులు, సుల్తానులు, బాద్షాలు చేసిన దౌర్జన్యాలపై మాట్లాడరన్నారు. హిందువుల మందిరాలను ధ్వంసం చేసిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పై ఎన్నడూ విమర్శలు చేయలేదన్నారు.

కాంగ్రెస్ షెహజాదా(రాహుల్ గాంధీ) భారత రాజులు చేసిన అరాచకాలపైనే మాట్టాడుతారు. పేదల నుంచి ఆస్తులు లాగేసుకున్నారంటారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, రాణి చిన్నమ్మ వంటి గొప్ప వారిని అవమానిస్తుంటారు. మైసూరు రాజకుంటుంబం ఎలాంటి సేవలందించిందో షెహజాదా(రాహుల్)కు తెలుసా ? ’ అని మోడీ ప్రశ్నించారు.

కర్నాటకలో ఇటీవల ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ భారత రాజులు, పాలకులు ప్రజల భూములను లాక్కున్నారని, కానీ దేశానికి స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం వచ్చాక, రాజ్యాంగం ఏర్పడ్డాకే  అలా లాక్కోవడం ఆగిందన్నారు. ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ షెహజాదా(రాహుల్ గాంధీ) ఇలాంటి కూతలు కూశారని మోడీ అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News