Saturday, November 23, 2024

సచివాలయ సంఘం అధ్యక్షుడిగా నరేందర్‌రావు

- Advertisement -
- Advertisement -

Narendra Rao as President of Secretariat Committee

తెలంగాణ రాష్ట్ర సచివాలయ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతులలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి, 200 మందికి పదోన్నతులను సాధించుకున్నామని రాష్ట్ర సచివాలయ సంఘo అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయ సంఘo నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘo అధ్యక్షుడిగా మాధవరం నరేందర్‌రావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి టి.శేఖర్ నుంచి ఆయన నియామక పత్రం అందుకున్నారు. అనంతరం నరేందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయంలో ఏ ఉద్యోగికి ఉద్యోగ పరమైన సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటు పడతానని తెలిపారు.ముఖ్యమంత్రి చొరవతో కొత్త పోస్టులు సృష్టించుకున్నామని, పదోన్నతులను కల్పించుకున్నామని తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘ కార్యవర్గం మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహిస్తుంది. 26 మందితో కూడిన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా షేక్ యూసఫ్‌మియా, కోశాధికారిగా రేండ్ల రాజేశం,ఉపాధ్యక్షులుగా పి.లింగమూర్తి, పి. శ్యామ్‌సుందర్, కె. రాజేశ్వర్ రెడ్డి, ఎన్. మంగమ్మ, కార్యదర్శులుగా వి. రమేష్, కె. శ్రీనివాసరావు, ఎం. నవీన్‌కుమార్, వి. ఉమానాగలక్ష్మి, ప్రచార కార్యదర్శిగా పి. శివాజీ, సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్. అరవింద్‌గౌడ్, క్రీడా కార్యదర్శిగా టి. స్వరణ్‌రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బి. దేవరాజు, సయ్యద్ అబ్దుల్ ఖదీర్, జి. కరుణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆర్డినేటర్లుగా కె. చలపతిరెడ్డి, షేక్ మలేఖ, కార్యవర్గ సభ్యులుగా జి. ప్రశాంత్ కుమార్, పి. సింధూరి, కె. సమ్మయ్య, మీర్ అహ్మద్‌అలీ, పి. చంద్రకళ, బి. కిషన్‌రావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరం నరేందర్‌రావుని పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News