Saturday, December 21, 2024

నరేష్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -
  • ఎఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్: బిఆర్‌ఎస్ కార్యకర్త ఎలేశ్వరం నరేశ్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త ఎలేశ్వరం నరేశ్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం ఆయన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారికి మనోధైర్యం కల్పిస్తూ ఆర్థిక సాయం అందజేశారు. బిఆర్‌ఎస్‌కి నరేశ్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరేశ్ ఆనారోగ్యంతో మరణించడం దురదృష్టకరమన్నారు. నరేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కరోన సంబవించిన తర్వాత ప్రతిఒక్కరూ వైద్యులకు అంతుపట్టని రోగాలతో కుప్పకులుతున్నారని వాపోయారు. ఏదైనా మనకు ఆనారోగ్యం సంభవిస్తే డాక్టర్లని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్, సర్పంచ్ బాగ్యనర్సింలు, మాజీ ఎంపిపి చిన్నమల్లయ్య, బారాస కార్యకర్తలు మహేశ్ , బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News