Monday, December 23, 2024

ఢిల్లీలో నారీశక్తి అవార్డుల ప్రదానం….

- Advertisement -
- Advertisement -

Womens Day

ఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నారీశక్తి అవార్డుల ప్రదానం జరుగుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి అవార్డులు ప్రముఖ మహిళలు అందుకోనున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఎంపికైన 29 మంది మహిళలకు అవార్డులు ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నారీ శక్తి పురస్కార గ్రహీతలతో భేటీ కానున్నారు. 2021కి గాను ఎపి నుంచి భాషావేత్త, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్నకు నారీ శక్తి అవార్డు ప్రదానం చేయనున్నారు. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షించినందుకు ప్రసన్నకు నారీ శక్తి అవార్డు ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News