Wednesday, January 22, 2025

29 మంది మహిళామణులకు నారీ శక్తి పురస్కారాలు

- Advertisement -
- Advertisement -
Nari Shakti Puraskar conferred on 29 womenప్రదానం చేసిన రాష్ట్రపతి కోవింద్

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా 14 అవార్డులు చొప్పున 2020, 2021 సంవత్సరాలకు మొత్తం 28 అవార్డులను రాష్ట్రపతి అందచేశారు. మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ అవార్డులకు అంకురార్పణ చేసింది.

నారీ శక్తి పురస్కారాలు అందుకున్న వారిలో సామాజిక వ్యాపారవేత్త అనితా గుప్తా, పేంద్రియ రైతు, గిరిజన హక్కుల కార్యకర్త ఉషాబెన్ దినేష్‌భాయ్ వాసవ, ఇన్నోవేటర్ నసీరా అఖ్తర్, ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్, డౌన్ సిండ్రోమ్ బాధిత కథక్ నాట్యకళాకారిణి సాయిలీ నందకిశోర్ అగావానె, పాములను కాపాడే మొదటి మహిళ వనితా జగదేవ్ బోరడే, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా తదితరులు ఉన్నారు. కాగా&అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పురస్కార గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. మహిళల సహకారం వల్లే మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News