Monday, December 23, 2024

‘నార్నే నితిన్’ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్

- Advertisement -
టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన‌ జీఏ 2 పిక్చ‌ర్స్ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో ఎప్పుడూ ముందుంటుంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వైవిధ్య‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్నారు వ‌రుస హిట్ చిత్రాల‌ను సొంతం చేసుకుంటున్నారు నిర్మాత‌ బ‌న్నీ వాస్‌. ఈ బ్యాన‌ర్‌లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, టాక్సీవాలా, ప్ర‌తిరోజు పండ‌గే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలను జీఏ 2 పిక్చ‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు అందించింది. తాజాగా ఈ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.9 సినిమా అన్న‌పూర్ణ గ్లాస్ హౌస్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో నార్నే నితిన్ హీరోగా న‌టిస్తున్నారు.
ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్ మారుతి స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.  అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందఉన్న ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వ‌ర్క్ చేయ‌బోతున్నారు.
నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న రెండో సినిమా ఇది. న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. అంజిబాబు కంచిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  కిర‌ణ్ కుమార్ మ‌న్నె ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి స‌మీర్ క‌ళ్యాణి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా రామ్ మిర్యాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News