Saturday, January 11, 2025

హనుమంతుడి పాత్రపై మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం

- Advertisement -
- Advertisement -

 

Narottam Mishra objection on Aadipurush movie

ముంబై: ప్రభాస్ కథానాయకుడుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ ఆది నుంచే వివాదాగ్రస్తం అవుతోంది. ఆ సినిమా టీజర్ విడుదలయ్యాక బిజెపి ప్రతినిధి, నటి మాళవిక అవినాశ్ విమర్శలు గుప్పించారు. ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ రామాయణం గురించి ఆకళింపు చేసుకోకుండా, రావణుడి పాత్ర గురించి అధ్యయనం చేయకుండానే చిత్రాన్ని తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను పిల్లలు చూసే యానిమేటెడ్ కార్టున్ చిత్రంలా తయారుచేస్తున్నారని రెచ్చిపోయారు. ఇదిలావుండగా ఇప్పుడు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా హనుమంతుడి పాత్రపై విమర్శలు గుప్పించారు. సినిమాలో హనుమంతుడికి సంబంధించిన సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయాలను సరిగా చూయించలేదన్నారు. హనుమంతుడు తోలుతో తయారుచేసిన అంగవస్త్రం ధరించినట్లు చూపారన్నారు. హనుమంతుడు ఎలా ఉంటాడన్నది హనుమాన్ చాలీసాలో వివరించబడిందని తెలిపారు. అభ్యంతరకర అంశాలను సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే చట్టపరమైన చర్యకు దిగుతానని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News