Monday, December 23, 2024

మర్డర్ మిస్టరీ క్రైం ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుదర్శన్, రంగస్థలం మహేశ్, అర్జున్ తేజ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శివనాగు మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది”అని అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ “సినిమా బాగా వచ్చింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంబాబు, రవికుమార్ చౌదరితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News