Friday, November 15, 2024

హెల్త్ హబ్‌గా నర్సంపేట నియోజకవర్గం

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా రూ. 1.20 కోట్లతో నిర్మించిన టీ డయాగ్నస్టిక్ హబ్‌ను శనివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి వర్చువల్ పద్ధతిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సహకారంతో నర్సంపేట నియోజకవర్గం హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దబడుతున్న సందర్భంగా ఈ అవకాశాలను ఈ ప్రాంత ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రారంభించిన టీ డయాగ్నస్టిక్ సెంటర్‌తో ప్రజా వైద్యం మరింత అందుబాటులోకి రానుందన్నారు. ఉచితంగా నిర్వహించే వైద్య పరీక్షలతో ప్రజలు వైద్య ఖర్చుల నుంచి ఎంతో ఉపశమనం పొందవచ్చన్నారు. ఇందులో 135 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రూ. 70 కోట్లతో 250 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణం, రూ. 30 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్, రూ. 6 కోట్లతో 49 పల్లె, బస్తీ దవఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నియోజకవర్గ ప్రజల వైద్య అవసరాలను గుర్తించి అన్ని రకాల సదుపాయాలతో కూడిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఎక్విప్‌మెంటును ఏర్పాటుచేసి అన్ని విధాలా సహకరిస్తున్న సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావులకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో శ్రీనివాసులు, ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్, బీఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గోనె యువరాజు, కౌన్సిలర్లు, ప్రభుత్వ వైద్యుల బృందం, ఎంపీపీలు, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News