Monday, December 23, 2024

మానవత్వం చాటిన నర్సంపేట డిపో మహిళా కండక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నర్సంపేట: ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నేటి మనిషి జీవితం ఉరుకులు, పరుగులతో కాలం వెళ్లదీస్తున్నాడు. పక్కవారికి ఆపదొస్తే నాకెందుకులే ఈ రిస్క్ అనుకుంటున్న వాళ్లే నేడు ఎక్కువ. నిజంగా చెప్పాలంటే నేటి సమాజంలో మానవత్వం మంట గలిసిపోతుంది. పక్కవారికి ఆపదొస్తే ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. ఇలాంటి క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆదివారం రాత్రి తన బస్సులో వరంగల్ నుంచి నర్సంపేట వైపు ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు సర్వాపురానికి చెందిన సరోజన ఉన్నట్టుండి తాను కూర్చున్న సీట్లోనే సొమ్మసిల్లి పడిపోయింది.

గుండెపోటు లక్షణాలో ఏమో తెలియదు. ఛాతిలో ఒకటే మంటా అంటూ ఆమె ఏడుస్తున్న తీరు ఆ బస్సు కండక్టర్ అమిరిశెట్టి రమాదేవి మనస్సును కదిలించింది. వెంటనే అప్రమత్తమై తన చేతులతో ఆ ప్రయాణికురాలిని సొంత బిడ్డలాగా దగ్గరికి తీసుకొని గుండె వద్ద నిమురుతూ ధైర్యం చెబుతూ నీళ్లు తాగిచ్చి అన్ని సపర్యలు చేసిన తీరు అక్కడి ప్రయాణికులకు కంటనీరు తెప్పించింది. డ్రైవర్‌ను వేగంగా ముందుకు పోనివ్వు అని చెప్పి వారి బంధువులకు సమాచారం అందించి నర్సంపేట బస్టాండ్‌కు చేరుకోగానే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కండక్టర్ రమాదేవి మానవత్వాన్ని చూసి బస్సులో ఉన్న ప్రయాణికులు ఆమెను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News