Thursday, January 23, 2025

‘నరసపల్లె’ మాస్ బీట్‌తో దుమ్ములేపిన సోహెల్..

- Advertisement -
- Advertisement -

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోహెల్ మాస్ బీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కనకవ్వ పాడిన నరసపల్లె పాట యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ పాటకు సోహెల్ మాస్ స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసింది.  ఈ సినిమాలో సోహెల్ కు జతగా హీరోయిన్‌ రూపా కొడవాయుర్ నటిస్తోంది.

మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News