Friday, January 10, 2025

ఉత్తమ సత్కారాల్లో నర్సాపూర్

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని, శుక్రవారం జిల్లా స్థాయి మెదక్ లో ,మయా గార్డెన్స్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపుర్ మున్సిపల్ ఇద్దరు కౌన్సిలర్స్ తో పాటు 7 మందికి,ఎమ్మెల్యే లు మదన్ రెడ్డి,పద్మాదేవేందర్ రెడ్డి,కలెక్టర్ రాజర్షి షా,అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంశ పాత్రలు అందుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఎక్కడైన ఎప్పుడైన కష్టపడినవారికి గుర్తింపు వస్తుందని, సేవాగుణం కలిగిన వారు గౌరవపథంలో ఉంటారని, నర్సాపూర్ పట్టణ ప్రగతిలో, ఉత్తమ అవార్డులు అందుకున్నవారిని అభినందించారు. ఉత్తమ అవార్డులు 1 వార్డు కౌన్సిలర్ డి.అశోక్ గౌడ్, 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పంబల లలిత బిక్షపతి, ఉత్తమ ఉద్యోగులుగా మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట్ గోపాల్ , మేనేజర్ వి.మధుసూదన్, కంప్యూటర్ ఆపరేటర్ రామెరాజు, ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులుగా ఆల్ ఫోన్స్ లిగోరి, పారిశుద్ధ్య కార్మికుడు నవీన్ లను, ప్రశంసా పత్రం మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయం ఛైర్మన్ చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News