Sunday, February 2, 2025

నర్సాపూర్ టికెట్ పై వీడని ఉత్కంఠ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నర్సాపూర్ టిక్కెట్ పై ఉత్కంఠ కొరసాగుతూనే ఉంది. ప్రగతి భవన్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డిని పిలుపు రావడంతో నిన్న రాత్రి(శనివారం) సాయంత్రం 8.30 సమయంలో ఆయన ప్రగతి భవన్ కు వెళ్లి మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్ లను కలిశారు.

సుమారుగా రెండు గంటల పాటు ఇద్దరు మంత్రులతో ఎమ్మెల్యే మదన్ రెడ్డితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత స్వయంగా సిఎం కెసిఆర్, మరో మారు ప్రగతి భవన్ కు పిలిపించుకొని చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మధన్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News