Monday, December 23, 2024

క్విజ్ పోటీల్లో నర్సాపురం విద్యార్థులదే మొదటి స్థానం

- Advertisement -
- Advertisement -

దుమ్ముగూడెం : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్విజ్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ లిట్రాసి బ్లాక్ లెవల్ పోటీలలో నర్సాపురం ఉన్నత పాఠశాల విద్యార్ధులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన క్విజ్ పోటీలలో దుమ్ముగూడెం, చర్ల భద్రాచలం మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీనగరం ఎస్‌బిఐ బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు నోడల్ అధికారికిగా వ్యవహరించారు. ఈ పోటీలలో నర్సాపురం ఉన్నత పాఠశాలకు చెందిన డి.కౌశిక్ సాయి రెడ్డి, కె.ప్రణదీపు ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానాలను సాధించారు.

అదేవిధంగా భద్రాచలం గర్ల్ హైస్కూల్‌కు చెందిన కె.జ్యోత్స, హరి సత్య, ద్వితీయ స్థానాన్ని సాధించారు. చర్ల కస్తూర్భాకు చెందిన హారిక, ప్రణవి తృతీయ స్థానం సాధించారు. వీరికి నగదు బహుమతి, రూ.5000, రూ.4000, రూ3000లను అందించారు. వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. పొదుపు అనే అంశం మన ప్రగతికి పునాది అని అన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు కె.విజయ కాంతారావు, ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News