నర్సింహానంద్ అరెస్టుపై పోలీసుల వివరణ
లక్నో: గత నెలలో హరిద్వార్‌లోని ‘ధర్మ సన్సద్‘ లేదా మతపరమైన సభలో మత పెద్ద నర్సింహానంద్ ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అతన్ని మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశాం అని తెలిపారు. అంతేకాదు మతపరమైన సభలో ద్వేషపూరిత ప్రసంగం చేసింనందుకు అరెస్ట్ చేయలేదని కూడా వివరించారు. అయితే పోలీససులు ద్వేషపూరిత ప్రసంగం కేసులో మత పెద్దకు నోటీసులు జారీ చేశామని, ఆ కేసులో కూడా ఆయన్ను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గతనెలలో జరిగిన మతపరమైన సభలో ద్వేషపూరిత ప్రసంగాలపై నమోదైన కేసులో యతి నర్సింహానంద్ పేరు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అయితే మతం మారక ముందు వసీం రిజ్వీగా ఉన్న జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి మాత్రమే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన ఏకైక నిందితుడు. ఈ ఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత, సుప్రీంకోర్టు జోక్యంతో అతని అరెస్టు జరిగింది.