Sunday, December 22, 2024

కానిస్టేబుల్ పరిస్థితి విషమం…. దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానిస్టేబుల్ రాజునాయక్ పై పాల్పడిన కరణ్ సింగ్ పై నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు కరణ్ సింగ్ మైనర్ స్టేజ్ నుంచే నేరాలకు అలవాటు పడినట్లు విచారణలో వెల్లడైంది. కిషోర్ కుమార్ రెడ్డి ని హత్య చేసిన చింటూ సింగ్ ను నార్సింగీ పోలీసులు పట్టుకున్నారు.

గత నాలుగు రోజుల నుండి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్న చింటూ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. చింటూ సింగ్ పై గతంలో ఉన్న కేసుల గురించి  పోలీసులు విచారణ చేస్తున్నారు. కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News