- Advertisement -
నార్సింగీ: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపూర్ వద్ద డీవైడర్ కారు ఢీకొట్టడంతో ఒక వైద్యుడు మృతి చెందగా వైద్యురాలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామినేని ఆసుపత్రిలో భూమిక, జస్వంత్ హౌస్ సర్జన్స్ గా పని చేస్తున్నారు. జన్వాడ లోని ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భూమికది ఎల్బీనగర్, జస్వంత్ ది బాచుపల్లి అని పోలీసులు తెలిపారు.
- Advertisement -