- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని హైదర్ షాకోట్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న వాహనాలపైకి బస్సు దూసుకెళ్లిన అనంతరం డివైడర్ ఢీ కొట్టుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి వాహనం ఆగిపోయింది. బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఓవర్ స్పీడ్ డే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -