Wednesday, January 22, 2025

మహిళ ఫిర్యాదు.. ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ఓ మహిళపై అత్యాచారం చేసి మోసగించిన ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ చందూ సాయి అలియాస్ చంద్రశేఖర్ సాయి కిరణ్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. తన ‘పక్కింటి కుర్రాడు’ వీడియోలు, ‘ధగడ్’ వెబ్ సిరీస్‌లకు గుర్తింపు పొందిన చందూ సాయి, ఏప్రిల్ 25, 2021న, తన పుట్టినరోజు సందర్భంగా, అమ్మాయిని తన ఇంటికి ఆహ్వానించి, పెళ్లి చేసుకుంటానని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు చందూ సాయిపై 420, 376 (2) (ఎన్) ఐపిసి సెక్షన్‌లు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అత్యాచారం, మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. చందూ సాయి తల్లిదండ్రులతో సహా మరో నలుగురి ప్రమేయంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. చందూ సాయిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News