Monday, December 23, 2024

టిడిపి నేతపై నార్సింగి పోలీసుల కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని టిడిపి నాయకుడు మాగంటి బాబుపై నార్సింగి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కోకాపేట ఓఆర్‌ఆర్ నియో పోలీస్ వద్ద నుంచి ఓఆర్‌ఆర్ వైపు వెళ్లేందుకు మాజీ ఎంపి మాగుంట బాబుతోపాటు మరికొంతమందిని నార్సింగి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను తోసివేసిన బాబు తన అనుచరులతో నానా హంగామా చేశారు. ఎస్సై, ఇన్స్‌స్పెక్టర్లను మీ అంతాచూస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఐపిసి సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News