Monday, March 10, 2025

మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

లావణ్య కేసులో అరెస్టైన మస్తాన్‌సాయి కస్టడీ కోరుతు నార్సింగి పోలీసులు గురువారం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్‌లో కోరారు. మస్తాన్‌సాయిపై లావణ్య ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లావణ్య నార్సింగి పోలీసులకు లావణ్య హార్డ్ డిస్క్ అందజేసిన విషయం తెలిసిందే. అందులో పలువురు యువతులు, వివాహితుల నగ్న వీడియోలు ఉండడంతో మర్ని వివరాల కోసం నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేయాలని భావిస్తున్నారు. మస్తాన్ సాయిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో వందలాది వీడియోస్‌ను గుర్తించిన పోలీసులు, మొబైల్‌ను సీజ్ చేశారు. మస్తాన్ సాయి స్నేహితుడు కాజాను అరెస్ట్ చేసి 41 నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ టెస్ట్‌లోనూ మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.

మస్తాన్ సాయి మొబైల్‌లో వేలాదిమంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకున్న తర్వాత మస్తాన్‌సాయిని డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆరా తీయనున్నారు. నగ్న వీడియోలు, డ్రగ్స్ వ్యవహారంపై నార్సింగి పోలీసులు విచారణ చేస్తున్నారు. మస్తాన్ సాయి కొంతమంది యువతులను ట్రాప్ చేసి నగ్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడని అభియోగాలు, ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హార్డ్ డిస్క్ కేసులో విచారణ చేస్తున్న సమయంలో వీకెండ్‌లో నిర్వహిస్తున్న డ్రగ్స్ పార్టీ విషయం బయటికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు సేకరించారు. డ్రగ్స్, నగ్న వీడియోలకు సంబంధించి పూర్తి స్థాయిలో నార్సింగ్ పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు కూడా తరలించారు.

అయితే జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించే క్రమంలో మస్తాన్ సాయికి కాజా అనే యువకుడికి డ్రగ్ టెస్ట్ చేయడంతో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్ కోణాలపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్, మొబైల్‌ను సీజ్ చేసిన పోలీసులు వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వచ్చే వారంలో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News