Friday, November 22, 2024

వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు క్రూ9 ప్రయోగం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సమస్య తలెత్తడంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్‌మోర్‌లు అంతరిక్షంలో చిక్కుకు పోయిన సంగతి తెలిసిందే. వారిని తిరిగి తీసుకు రాడానికి స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్‌ను ప్రయోగించినట్టు నాసా వెల్లడించింది. ఫ్లోరిడా లోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ అంతరిక్షం లోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్టు తెలిపింది.
ఇందులో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బుచేవ్ ఉన్నట్టు నాసా వెల్లడించింది. చిక్కుకున్న ఇద్దరిని తిరిగి తీసుకురాడానికి ఇందులో రెండు సీట్లు ఖాళీగా ఉంచినట్టు తెలిపింది. గత జూన్ 6న బోయింగ్‌స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో సునీత, విల్‌మోర్‌లు అంతరిక్షానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14న వీరు తిరిగి రావాల్సి ఉండగా, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News