Sunday, January 26, 2025

ఆర్టెమిస్-1 ప్రయోగం సకాలంలో జరిగేనా?

- Advertisement -
- Advertisement -

 

NASA Artemis-1

సెప్టెంబర్ 23న ‘ఆర్టెమిస్-1’ ప్రయోగం షెడ్యూల్

న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టెమిస్-1’ ప్రయోగం మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదాపడింది. తాజాగా మూడోసారి ప్రయోగానికి సెప్టెంబర్ 23వ తేదీని షెడ్యూల్‌గా ఖరారు చేశారు. అయితే దీన్ని మరికొద్ది రోజలు వాయిదా వేయాలని ‘నాసా’ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న ప్రయోగం చేపట్టడం సాధ్యం కాకపోతే మళ్లీ అక్టోబర్ 2న ప్రయోగించే అవకాశం ఉంటుంది. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్1 ప్రయోగం. ఇదివరలో ఇంధన లీకేజీ సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు. చంద్రుడిపై శాశ్వత నివాసానికి వీలుగా ఈ ప్రయోగం చేపడుతున్నారు.అయితే ఇప్పుడు ఓరియన్ క్యాప్సూల్ మానవరహితంగానే చంద్రుడిపైకి వెళ్లనుంది. కానీ 2024లో ఆర్టెమిస్2,  2025లో ఆర్టెమిస్3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News