Thursday, December 19, 2024

అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా

- Advertisement -
- Advertisement -

NASA Astronaut Shares Picture Of Indian Flag Aboard ISS

హైదరాబాద్ వెలిగిపోతోంది : వ్యోమగామి రాజాచారి

న్యూఢిల్లీ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడుకలను నిర్వహించగా, వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తులు ఉత్సాహంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అమెరికా లోని ప్రముఖ టెస్ట్ పైలట్ , వ్యోమగామి రాజాచారి ఆసక్తికర ఫోటోలు ట్వీట్ చేశారు. “ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రవాస భారతీయుడిగా నా తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నా… భారత అమెరికన్లు నిత్యం పురోగమిస్తోన్న వాటిల్లో నాసా కూడా ఒకటి” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ఓ బెలూన్ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడ పతాకాన్ని ఆవిష్కరించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News