Monday, March 17, 2025

9 నెలలుగా అంతరిక్షంలో సునితా విలియమ్స్

- Advertisement -
- Advertisement -

అంతరిక్షంలో 8 రోజుల ఉండేందుకు బయలుదేరిన నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విర్మోర్ అనూహ్యంగా కొన్ని సమస్యల కారణంగా ఏకంగా 9 నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకు పోయారు. మొత్తం మీద
స్పేస్ ఎక్స్ డ్రాగాన్ అంతరిక్ష నౌక లో భూమికి రెండు మూడు రోజుల్లో తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. అంతరిక్షంలో ఇంతకాలం ఉన్న సునితా విలియమ్స్ నాసా సంస్థ ఎంత మొత్తం చెల్లిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.నాసా సంస్థలో సునితా విలియమ్స్ జిఎస్ -15 పే గ్రేడ్ ఉద్యోగి. జనరల్ షెడ్యూల్ వ్యవస్థ ప్రకారం సమాఖ్య ఉద్యోగులలో ఇదే అత్యున్నత స్థాయి. నాసా నిబంధనల ప్రకారం వ్యోమగాములకు ఓవర్ టైమ్ జీతాలు ఏమీ ఉండవు.

వారు కూడా ఇతర ఉద్యోగులతో సమానులే. భుమిలో అధికార పర్యటనకు వెళ్లినట్లు గానే అంతరిక్షంలో వారు గడిపిన సమయాన్ని పరిగణిస్తారని నాసా లో గతంలో వ్యోమగామిగా పనిచేసిన కాడీ కోల్ మాన్ తెలిపారు. ఇక్కడి మాదిరిగానే వారికి రోజువారీ జీతం చెల్లిస్తారు. అలాగే ఐఎస్‌ఎస్ లో వారి భోజనం, వసతి ఖర్చులను నాసా భరిస్తుంది. వారికి అదనంగా పరిహారంగా రోజువారీ స్టైఫండ్ – రోజుకు కేవలం 4 అమెరికా డాలర్లు,అంటే దాదాపు 347 రూపాయలు మాత్రమే ఇస్తారని కోల్ మాన్ వాషింగ్టన్ తెలిపారు. అంతరిక్షంలో 8 రోజులు ఉండేందుకు వెళ్లిన సునితా విలియమ్స్ , విల్మోర్ అదనంగా 287 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. అందువల్ల అదనంగా ఒకొక్కరికి కేవలం 1,148 అమెరికా డాలర్లు.. (సుమారు లక్ష రూపాయలు) మాత్రమే లభించే అవకాశం ఉంది.  సాంకేతికంగా మాట్లాడాలి అంటే.. వారిద్దరూ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోలేదు. ఐఎస్ ఎస్ లో పని చేస్తున్నారు.

సునితాకు వచ్చే జీతం ఎంత?

సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ జిఎస్ -15 పేగ్రేడ్ ఉద్యోగులు. వారి వార్షిక బేసిక్ జీతం 125,133 డాలర్ల నుంచి 162-672 డాలర్లు మాత్రమే అంటే..సుమారు రూ. కోటీ 9లక్షల నుంచి కోటీ 41 లక్షల రూపాయల మధ్య పొందుతారు. ఇక ఐఎస్ ఎస్ లో 9 నెలల పాటు వారి యాత్ర పొడిగించినందువల్ల సునితకు, విల్మోర్ కు 93, 850 డాలర్ల నుంచి 122,004
డాలర్ల మధ్య జీతం అందుకుంటారు. ఇన్సిడెన్షల్ పే కింద 1,148 డాలర్లతో సహా ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన 94,998 నుంచి 125,152 డాలర్లు ఉంటుందని అంచనా.

తిరుగు ప్రయాణ సన్నాహాలు

ఐఎస్ ఎస్ లో ఉన్న సునితా విలియమ్స్,విల్మోర్ ను సురక్షితంగా భూమికితెచ్చేందుకు నాసా ఆమోదంతో డ్రాగాన్ అంతరిక్ష నౌకతో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ గత శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడా లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా
అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. డ్రాగాన్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఐఎస్‌ఎస్ లో దిగింది. నాసాకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ -10 మిషన్ ఐఎస్ ఎస్ చేరింది ఇందులో నలుగురు కొత్త సిబ్బంది ఉన్నారు. వారు వ్యోమగాములు అన్నే మెక్ కయిన్, నికోల్ ఆయర్స్,జపాన్ ఏరో స్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సికి చెందిన వ్యోమగామి టకుయా ఒనిషి,రెస్కో స్కోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. ఇక సునిత విలియమ్స్, విల్మోర్ తిరుగు ప్రయాణమే తరువాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News