Monday, December 23, 2024

సూర్యుడి నుంచి వేరు పడే వెలుగు రేఖ.. ద్రువ సుడిగుండం

- Advertisement -
- Advertisement -

నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ ఈ నెల 2 న అద్భుతమైన నిగూఢ రహస్యాన్ని కనుగొనగలిగింది. ఇది “ద్రువ సుడిగుండం ” గా అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్త తమితాస్కోవ్ ట్విట్టర్ ద్వారా అభివర్ణించారు. టెలిస్కోప్ ఫుటేజీ సౌర ప్రాముఖ్యతను చూపించిందని పేర్కొన్నారు.

సూర్యుడి నుంచి భారీ ప్రకాశవంతమైన వెలుగు రేఖ బయటకు విస్తరించడం , అది సౌర ఉపరితలంపైనే అంటిపెట్టుకుని ఉండడం ఈ సంఘటన దృశ్యం. సూర్యుని వెలుగు లోని ఒక భాగం విడిపోయినట్టు కనిపించినా, అది మన భూమి ఉత్తర ద్రువం చుట్టూ వలయంలా ప్రజ్వరిల్లుతున్నట్టు కనిపించింది. ఇలాంటి దృశ్యాన్ని తాను మొదటి సారి చూశానని సౌర భౌతిక శాస్త్రవేత్త స్కాట్ మెయింతోష్ పేర్కొన్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ రీసెర్చి డిప్యూటీ డైరెక్టర్‌గా మెయింతోష్ పనిచేస్తున్నారు. ఇక ముందు ఇలాంటిది ఏర్పడదని చెప్పడం కాదని పేర్కొన్నారు. ఇదివరకు ఇలాంటి ద్రువ సుడిని తాను చూడక పోయినప్పటికీ, 55 డిగ్రీల అక్షాంశంలో అదే చోట సౌర ప్రాముఖ్యత కనిపించిందని చెప్పారు. ప్రతి 11 ఏళ్ల సౌరచక్రంలో ఇలాంటివి ఏర్పడుతుంటాయన్నారు.

ఇది బహుశా సూర్యుని అయస్కాంత క్షేత్రం ప్రతి సౌర చక్రాన్ని రివర్స్ చేయడం వల్ల సంభవించింది కావచ్చని భావించారు. ఇది ఎలా జరుగుతుందన్నది మిస్టరీగా పేర్కొన్నారు. ఇలాంటివి సూర్యుని ఉత్తర ద్రువం వద్ద ఏర్పడుతుంటాయని , అయితే అవి భూమిపైపు రావని, అందువల్ల జిపిఎస్, రేడియో వంటి సాంకేతిక వ్యవస్థలకు ఎలాంటి విధ్వంసకర పరిణామాలు ఎదురుకావని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News