Monday, December 23, 2024

ఐఎస్‌ఎస్‌కు నాలుగు దేశాల నలుగురు వ్యోమగాముల పయనం

- Advertisement -
- Advertisement -

కేప్ కెనవెరాల్ : నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. ఈ నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ రాకెట్ శనివారం అమెరికా కేప్ కెనవెరాల్ లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం గగనతలానికి దూసుకెళ్లింది. భూ కక్షలో పరిభ్రమిస్తున్న “ ఐఎస్‌ఎస్‌” కు వారు ఆదివారం చేరుకోనున్నారు. ఇప్పటికే మార్చి నుంచి ఐఎస్‌ఎస్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములను వీరు భర్తీ చేయనున్నారు. ఇప్పుడు బయలుదేరిన నలుగురిలో నాసాతోపాటు డెన్మార్క్, జపాన్, రష్యాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఆరునెలల పాటు వీరు అక్కడ విధులు నిర్వహిస్తారు.

నాసాకు చెందిన జాస్మిన్ మోఘ్‌బెలి ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీకి వెళ్లారు. జర్మనీ లోనే జన్మించిన జాస్మిన్ న్యూయార్క్‌లో పెరిగారు. మెరైన్ పైలట్ అయ్యారు. మొట్టమొదటిసారి అంతరిక్షం లోకి వెళ్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆంద్రియాస్ మొగెన్‌సెన్ డెన్మార్‌కు చెందిన వారు. ఆ దేశానికి చెందిన మొదటి వ్యోమగామి. జపాన్‌కు చెందిన సతోషి పురుకావా, రష్యాకు చెందిన కాన్‌స్టాంటిన్ బొరిసోవ్ ఈ బృందం లోని వ్యోమగాములు. శుక్రవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా కాప్సూల్ ‘లైఫ్ సపోర్ట్ సిస్టమ్’ అదనపు సమీక్షల కారణంగా ప్రయోగం ఒకరోజు ఆలస్యమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News