Friday, November 22, 2024

అంగారకునిపై 12 సార్లు చక్కర్లు కొట్టిన ఇంజెన్యూటీ

- Advertisement -
- Advertisement -

NASA Mini Helicopter Is Still Flying High on Mars

 

వాషింగ్టన్ : అంగారక గ్రహం పైకి నాసా పంపిన చిన్ని హెలికాప్టర్ ఇంజెన్యూటీ ఇప్పటికే 12 సార్లు చక్కర్లు కొట్టితన సత్తా చాటింది. అంగారక గ్రహంపై కేవలం ఐదుసార్లు మాత్రమే ఎగరడం కోసం పంపగా, గత ఆరు నెలలుగాకఠిన సవాళ్లను ఎదుర్కొని తన సేవలను నిరంతరాయంగా అందిస్తోంది. ఇంజెన్యూటీ మెరుగైన పనితీరు, ఊహించనివిజయాన్ని చూసిన నాసా శాస్త్రవేత్తలు దీని కాల పరిమితిని నిరవధికంగా పొడిగించడం విశేషం. అంగారక గ్రహంపైప్రాచీన జీవ ఉనికిపై పరిశోధనలు చేపట్టేందుకు పంపించిన పర్సెవరెన్స్ రోవర్‌కు ఇది ప్రయాణ సహచరిగా మారి,అక్కడ విశేషమైన సేవలు అందిస్తోంది. హెలికాప్టర్ లోని ప్రతీదీ చాలా చక్కగా పనిచేస్తోంది. తాము ఊహించినదానికంటే మెరుగైన పనితీరును చూస్తున్నామని ఇంజెన్యూటీ మెకానికల్ హెడ్ జోష్ రావిచ్ తెలిపారు. ఈ ఏడాదిఏప్రిల్ 19 న ఇంజెన్యూటీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇతర గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్ ఇదిరికార్డు సృష్టించింది. అంచనాలకు మించి ఇది మరో 11 సార్లు అక్కడ విజయవంతంగా చక్కర్లు కొట్టింది. ఇటీవలేఆగస్టు 18 న తన 12 వ యాత్రను పూర్తి చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News