Thursday, January 23, 2025

NASA : ఆర్టిమిస్2 ప్రయోగానికి నలుగురు వ్యోమగాముల ఎంపిక

- Advertisement -
- Advertisement -

చంద్రునిపై సుదీర్ఘకాలం వ్యోమగాములు నివసించి పరిశోధనలు సాగించేందుకు తోడ్పడే ఆర్టిమిస్ 2 ప్రయోగానికి అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసా సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ సారి ఆర్టిమిస్2 ప్రయోగానికి నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. వీరిలో నాసాకు చెందిన వ్యోమగాములు రెయిడ్ వైస్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా హేమక్ కోచ్‌లతోపాటు సిఎస్‌ఎ వ్యోమగామి జెరిమీ హాన్సన్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి తమ స్వంత చరిత్ర ఉన్నప్పటికీ తమ బృందంగానే పరిగణింప బడతారని నాసా వెల్లడించింది.

క్రిస్టినా కోచ్ ఎలెక్ట్రికల్ ఇంజినీర్. అంతరిక్షంలో నడక సాగించిన నాసాకు చెందిన మొదటి ముగ్గురు మహిళా వ్యోమగాముల్లో ఒకరు. వచ్చే ఏడాది ఆర్టిమిస్ ప్రయోగానికి సన్నద్ధమవుతున్న మిషన్ స్పెషలిస్ట్‌గా పేరు గడించారు. అంతరిక్షస్థావరంలో ప్లైట్ ఇంజినీర్‌గా పనిచేశారు. అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన ఏకైక మహిళా వ్యోమగామిగా రికార్డు సాధించారు. ఆర్టిమిస్ 11 పైలట్‌గా నియామకమైన విక్టర్ గ్లోవర్ అమెరికా నేవీ వైమానికుడు. నాలుగుసార్లు అంతరిక్షంలో నడక సాగించిన అనుభవం ఉంది. ఇంతవరకు నల్లజాతీయులు ఎవరూ చంద్ర యాత్రకు వెళ్లలేని నేపథ్యంలో ఈ నల్లజాతీయుడు ప్రప్రథమంగా ఆర్టిమిస్ యాత్రకు బయలుదేరుతున్నాడు.

ఈ మిషన్ ఆయనకు రెండో అంతరిక్షయాత్ర అవుతుంది. గతంలో నాసా స్పేస్ ఎక్స్ క్రూ1 పైలట్‌గా పనిచేశారు. 168 రోజులు అంతరిక్షంలో గడిపిన తరువాత 2021 మే 2 న ఈ క్రూ భూమికి చేరింది. ఫ్లైట్ ఇంజినీర్‌గా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు. అంతరిక్ష నడకల్లో నాలుగు సార్లు పాల్గొన్నారు. మరో మాజీ అమెరికా నేవీ ఫ్లైటర్ పైలట్ రెయిడ్ వైస్‌మాన్ మిషన్ కమాండర్‌గా నియామకమయ్యారు. అంతరిక్షంలో ఆయన రెండోసారి అడుగుపెడుతున్నారు. 2014లో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఫ్లైట్ ఇంజినీర్‌గా పనిచేశారు.

అంతరిక్షంలో 168 రోజులు గడిపాడు. ఆర్బిటల్ కాంప్లెక్సు బయట దాదాపు 13 గంటల పాటు నడిచే అనుభవం ఉంది. ఇంతవరకు చంద్రయాత్రకు వెళ్లని జెరెమీ హాన్సెన్ కెనడాకు చెందిన వ్యక్తి . కెనడా ఆర్మీ కల్నల్ అయిన జెరెమీ పైలట్‌గా పనిచేసేరు. కెనడా రాయల్ మిలిటరీ కాలేజీ స్పేస్ సైన్స్ లో డిగ్రీ పొందారు. అదే సంస్థ నుంచి 2000 లో ఫిజిక్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఈ నలుగురు వ్యోమగాములను అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News