Friday, November 22, 2024

లూనా-25 కూలిపోయిన ప్రాంతం గుర్తింపు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : చంద్రుడిపైకి ఇటీవల రష్యా ప్రయోగించిన లూనా-25 మిషన్ కూలిపోయిన చోట భారీ గొయ్యి ఏర్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. గత నెల రష్యా లూనా -25ను ప్రయోగించింది. అయితే ఆగస్టు 21న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే యత్నంలో భాగంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తులోనే విఫలమై కూలిపోయింది. అది కూలిన చోట దాదాపు 10 మీటర్ల వెడల్పయిన గొయ్యి పడింది. నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ చిత్రాలను తీసింది. ’కొత్తగా ఏర్పడిన బిలం సుమారు 10 మీటర్ల వెడల్పు ఉంది. ఇది లూనా-25 ల్యాండ్ అవడానికి నిర్దేశించిన ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. ఆ మిషన్ కూలడం వల్ల ఏర్పడి ఉండవచ్చు అని నాసా పేర్కొంది. లూనా 25 ప్రాజెక్టు విఫలం కావడంతో రష్యా దీనిపై విచారణ జరిపేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News