కెన్నెడీ స్పేస్ సెంటర్ (యునైటెడ్ స్టేట్స్): ఇంజనీర్లు ఇంధన లీకేజీని గుర్తించిన తర్వాత ‘నాసా’ శనివారం తన 30-అంతస్తుల రాకెట్‌ను భూమి నుండి ప్రయోగించే రెండవ ప్రయత్నాన్ని రద్దు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, సమీపంలోని బీచ్‌లలో వందల వేల మంది భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) యొక్క చారిత్రాత్మక ప్రయోగం కోసం వేచి ఉండటంతో, అల్ట్రా-కోల్డ్ లిక్విడ్ హైడ్రోజన్‌ను పంప్ చేస్తున్నప్పుడు రాకెట్ బేస్ దగ్గర లీక్ కనుగొనబడింది.
“ప్రయోగ దర్శకుడు నేటి ఆర్టెమిస్I ప్రయోగాన్ని రద్దు చేసారు” అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. “లీక్ ను పరిష్కరించడానికి చేసిన అనేక ట్రబుల్ షూటింగ్ ప్రయత్నాలు సమస్యను పరిష్కరించలేదు”. దాదాపు మూడు మిలియన్ లీటర్ల అల్ట్రా-కోల్డ్ లిక్విడ్ హైడ్రోజన్, ఆక్సిజన్‌ను అంతరిక్ష నౌకలోకి పంప్ చేయాల్సి ఉండింది. కానీ ఆ ప్రక్రియ అనతి కాలంలోనే సమస్యలను ఎదర్కొంది. కాగా తదుపరి ప్రయోగానికి సంబంధించిన తేదీని ఇంకా ప్రకటించలేదు.