Monday, December 23, 2024

విశ్వం సుదూర తీరాల నుంచి లేజర్ సందేశం

- Advertisement -
- Advertisement -

అంతరిక్ష అగాధం నుంచి భూమికి ఇటీవల ఓ అంతుచిక్కని లేజర్ సందేశం వెలువడింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ విషయాన్ని వెల్లడించింది. భూమికి దాదాపు 140 మిలియన్ మైళ్ల దూరంలోని స్పేస్ పొరల్లోనుంచి ఈ లేజర్ కాంతిపుంజపు సందేశం చేరుకుందని తెలిపారు. గత ఏడాది 2023 అక్టోబర్‌లో నాసా విశ్వంలోని గ్రహశకలం సైకి 16పై పరిశోధనలకు ఓ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. దీనికి సైకి అని పేరు పెట్టారు. విశ్వంలోని ఇతర అస్టరాయిడ్స్‌తో పోలిస్తే సైకి 16 భిన్నంగా ఉంటుంది. పూర్తిగా లోభభరితం అయి ఉంది. ఇది అంతరిక్ష వ్యవస్థలో ఓ అరుదైన విషయం. అంగారకుడు, గురు గ్రహాల మధ్య విస్తారిత క్షేత్రంలో ఈ గ్రహశకలం తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఈ దిశలో నాసా పంపించిన సైకి వ్యోమనౌక పలు అధునాతన పరిశోధక పరికరాలతో ముందుకు సాగింది. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (డిఎస్‌ఒఎస్) వ్యవస్థతో ఉన్న

ఈ అంతరిక్ష నౌక భూమికి 140 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతం నుంచి అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ డాటాను సేకరించింది. ఈ ప్రాంతం భూమికి సూర్యుడికి మధ్య దూరం కన్నా ఒక్కటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ఈ వ్యోమనౌకలోని ట్రాన్సిమీటర్లను వినియోగించుకుని లేజర్ సందేశాన్ని సేకరించిందని నాసా వర్గాలు వెల్లడించాయి. సంబంధిత విశేషాలను సదర్న్ కాలిఫోర్నియాలోని నాసాకు చెందిన జెట్ ప్రపుల్సన్ లాబోరేటరి (జెపిఎల్) కార్యకలాపాల సారధి మీరా శ్రీనివాసన్ మీడియా సంస్థలకు తెలిపారు. ఓ వైపు సైకి ఇప్పటికీ అస్టరాయిడ్‌పై పరిశోధనలు సాగిస్తూనే ఉంది. అయితే దీనికి చిక్కిన అత్యంత విలువైన లేజర్ సందేశం ఇప్పుడు నాసాకు లభ్యం అయిందని శ్రీనివాసన్ వివరించారు. ఇందులో ఏముందనేది కనుగొనడానికి పరిశీలన జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News