Friday, November 22, 2024

తుపాన్లను ముందుగా అంచనా వేసే శాటిలైట్లు

- Advertisement -
- Advertisement -

ఉష్ణమండల తుపాన్లను గంటగంటకు ముందుగా అంచనా వేయగల రెండు చిన్న ఉపగ్రహాలను (satellites)నాసా ప్రయోగించింది. న్యూజిలాండ్ స్థావరం నుంచి ఈ ప్రయోగం జరిగింది. విధ్వంసాలను సృష్టించే తుపాన్ల రాకను ఈ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు అంచనా వేయగలుగుతాయి. అమెరికా కంపెనీ రాకెట్ ల్యాబ్ తయారు చేసిన రాకెట్ ద్వారా ఉపగ్రహాలను కక్ష లోకి పంప గలిగారు.

Also Read: యూకే పర్యటనకు బయలుదేరిన మంత్రి కెటిఆర్

ప్రస్తుతం అమలులో ఉన్న శాటిలైట్లు ప్రతి ఆరు గంటల కోసారి తుపాన్లను అంచనా వేస్తుండగా, ఇప్పుడు ప్రయోగించిన శాటిలైట్లు ప్రతి గంటకు భీకర హరికేన్ల మీదుగా ప్రయాణించి వాతావరణాన్ని సమీక్షిస్తాయి. దీన్ని బట్టి పరిశోధకులు గంటకోసారి తుపాన్ల పుట్టుకను తెలుసుకోగలుగుతారని నాసా శాస్త్రవేత్త విల్ మెక్ కార్టీ చెప్పారు. ఈ కొత్త శాటిలైట్ల నుంచి వచ్చే సమాచారాన్ని ప్రస్తుతం వినియోగంలో ఉన్న శాటిలైట్ల సమాచారానికి అదనంగా చేర్చి విశ్లేషించడానికి వీలవుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News