Monday, November 18, 2024

చంద్రుడిని గెల్వడం ఈజీ ఏం కాదు

- Advertisement -
- Advertisement -

ముంబై : గడిచిన ఏడు దశాబ్దాలలో సాగిన 116 చంద్రమండల యాత్ర ప్రయోగాలలో 62 విజయవంతం అయ్యాయి. 41 వరకూ విఫలం అయ్యాయి. కాగా ఎనిమిదింటిలో పాక్షిక విజయం దక్కింది. మూన్‌మిషన్లపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గణాంకాల వివరాలతో ఈ విషయాలు వెల్లడయ్యాయి. శుక్రవారం చంద్రయాన్ 3 ప్రయోగం తొలిదశ విజయవంతం అయిన నేపథ్యంలో చంద్ర ప్రయణాల వివరాలు తిరిగి ప్రస్తావనకు వచ్చాయి. చంద్రుడి వైపు శాటిలైట్ దూసుకువెళ్లడం ఓ ఎత్తయితే చంద్రుడి ఉపరితలంపై శాటిలైట్ సజావుగా దిగడం మరింత కీలకం. చంద్రుడిపై సరైన విధంగా ల్యాండ్ అయితేనే ఈ ప్రయోగాల విజయవంత సంపన్న దేశాల శ్రేణిలో భారత్ నాలుగవ దేశం అవుతుంది. ఆగస్టు చివరిలో కానీ ఈ విషయం నిర్థారణ కాదు.

సక్సెస్ రేటు సగమే ః ఇస్రో మాజీ ఛైర్మన్
ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు లూనార్ పరీక్షలలో సక్సెస్ రేటు దాదాపు సగమే అని ఇస్రో మాజీ ఛైర్మన్ జి మాధవన్ నాయర్ తెలిపారు. రాకెట్లు భూ గురుత్వాకర్షణ వలయాలను దాటే దశలో పలు క్లిష్టతలు ఉంటాయి. ప్రయాణంపై అనిశ్చితలను తెచ్చిపెడుతాయని, వీటిని దాటుకునే వెళ్లితేనే ప్రయోగం సంపూర్ణ విజయ ఖాతాలో చేరుతుందని నాయర్ చెప్పారు.
రేడియేషన్ అత్యంత క్లిష్టమైన పరీక్ష
చంద్రుడి వైపు సాగే దశలో ఇతర గ్రహాలు, సూర్యుడి నుంచి ప్రభావాలు కొంత మేరకు ఉండనే ఉంటాయి. అయితే వీటిని మించి అంతరిక్షంలో ఉండే రేడియేషన్ పరిస్థితులతో క్లిష్టత ఏర్పడుతుంది. ఇది ఓ దశలో అనూహ్యరీతిలో ఉండవచ్చు. అణుధార్మికత ప్రసరణకు గురవుతే కొన్ని భాగాలు, అంతర్గత పరికరాలు దెబ్బతినేందుకు వీలేర్పడుతుంది. దీనితో ప్రయోగ సమీకరణలో సంక్లిష్టత తలెత్తుతుందని మాధవన్ నాయర్ తెలిపారు. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2ల క్రమంలో ఇండియా మనం దాదాపుగా పూర్తిస్థాయిలోనే చంద్రుడి కక్షలోకి చేరామని, ఇది పూర్తి విజయ స్థాయికి చేరకపోయినా అపజయం పరిధిలోకి రాదని విశ్లేషించారు.

చంద్రుడివైపు తొలి యాత్ర 1958లో
చంద్రుడికి తొలి యాత్ర పయనీర్ 0 పేరిట అమెరికా నుంచి 1958 ఆగస్టు 17న చేపట్టారు. ఇది విజయవంతం కాలేదు. అదే సంవత్సరం అమెరికా, రష్యాల నుంచి మరో ఆరు యాత్రలు చేపట్టారు. కానీ ఇవి కూడా సక్సెస్ కాలేదు. 1959 జనవరి 2న అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) చేపట్టిన లూనా 1 పాక్షికంగా విజయం సాధించింది. 1964 జులైలో అమెరికా చేపట్టిన రేంజర్ 7 మిషన్ చంద్రుడిని అతి దగ్గరి నుంచి చిత్రీకరించింది. ఈ ఫోటోలు అప్పట్లో సంచలనం కల్గించాయి. ఇక చంద్రుడి ఉపరితలంలోపైకి వ్యోమనౌక దిగిన తొలివిజయం ఘనత రష్యాకే చెందుతుంది. 1966 మే నెలలో రష్యాకు చెందిన లూనా 9 ,చంద్రుడిపైకి చేరిన ఫోటోలను వెలువరించింది. ఈ ఏడాదే అమెరికాకు చెందిన సర్వేయర్ 1 ఇటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది.

చంద్ర మండల యాత్రలో కీలకం జులై 1969
నీలినీడల చంద్రుడిపైకి మనిషి అడుగు
చంద్రుడిపైకి మనిషి అడుగుపెట్టిన తొలి విజయం అపోలో 11 మిషన్ ద్వారా 1969 జులైలో సాధ్యం అయింది. అప్పట్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సారధ్యంలో ముగ్గురు వ్యోమగాములు చంద్రుడిపై దిగారు. 1958 నుంచి 1979 వరకూ కేవలం అమెరికా , సోవియట్ యూనియన్లే ఈ 21 ఏండ్లలో చంద్ర ప్రయోగాలు సాగించాయి. ఈ దశలో ఈ రెండు దేశాలు దాదాపుగా 90 వరకూ ఇటువంటి ప్రయోగాలను చేపట్టాయి. ఇక 1980 నుంచి 89 వరకూ చంద్రయాత్రలో స్తబ్దత ఏర్పడింది. ఈ దశలో ఎటువంటి పరీక్షలు జరగలేదు. ఇండియా, ఇజ్రాయెల్, జపాన్, చైనా, ఇయూలు ఈ రేస్‌లో ఆ తరువాతనే చేరాయి. జపాన్ హితెన్‌ను చేపట్టింది. తరువాత సెలెన్‌ను చేపట్టగా, చైనా నుంచి ఛాంగ్ ఎ , ఇండియా నుంచి చంద్రయాన్‌లు సాగాయి. ఇక 1990 నుంచి అమెరికా, జపాన్, ఇండియా , ఇయూ, చైనా, ఇజ్రాయెల్‌లు సమిష్టిగా 21 లూనార్ మిషన్లు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News