Friday, November 15, 2024

గుజరాత్‌లో నాసల్ ఫంగస్

- Advertisement -
- Advertisement -

Nasal Aspergillosis fungus in Gujarat

బ్లాక్‌ఫంగస్ కన్నా భయానకం

అహ్మదాబాద్ / న్యూఢిల్లీ : గుజరాత్‌లో తీవ్రస్థాయి సరికొత్త ఫంగస్ తలెత్తింది. ముక్కు పుటాల ద్వారా అతివేగంగా విస్తరిస్తోన్న ఈ ఫంగస్‌ను నాసల్ అస్పర్‌గిలోసిస్ అని వ్యవహరిస్తున్నారు. వడోదర ఇతర ప్రాంతాలలో దీనిని తొలుత గుర్తించారు. బ్లాక్, యెల్లో వైట్ ఫంగస్‌లతో పోలిస్తే ఇది మనిషి నుంచి మనిషికి వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. గుజరాత్‌లో ఇప్పటికే 262 బ్లాక్‌ఫంగస్‌లు కనుగొన్నారు. సైనస్ తీవ్రత ఎక్కువగా ఉండే వారికి ఈ కొత్త ఫంగస్ తలెత్తుతోందని వైద్య ఆసుపత్రి వర్గాల నిర్థారణతో వెల్లడైంది. వడోదరాలోని ఎస్‌ఎస్‌జి హాస్పిటల్‌లో ఈ ఫంగస్ కేసులు 8 గుర్తించారు. గత వారం ఈ రోగులను ఆసుపత్రుల్లో చేర్చారు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు, దీనితో పాటు శ్వాస సంబంధిత సమస్యలు,ముక్కుపుటాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ ఫంగస్ ఎక్కువగా సోకుతోందని ఎస్‌ఎస్‌జి హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. అస్పర్‌గిలోసిస్ బ్లాక్‌ఫంగస్ కన్నా ప్రమాదకారి. ఇది కూడా ఎక్కువగా కరోనా వచ్చి కోలుకున్నవారిలో కన్పిస్తోందని డాక్టర్‌శీతల్‌మిస్త్రీ తెలిపారు. ఫంగల్ వ్యాధి అవకాశం వచ్చినప్పుడల్లా అమాంతంగా మనిషిని అంటుకుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండే ఫంగస్‌కణజాలం ఎక్కువగా గ్లూకోస్‌తో పెరుగుతుంది. మధుమేహం ఉండే వారికి, ఎక్కువగా స్టెరాయిడ్స్‌లు వాడే వారికి బహువిధాలుగా ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని మిస్త్రీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News