Sunday, November 17, 2024

అంగారక గ్రహం సన్నని గాలి నుంచి ఝాంకారం

- Advertisement -
- Advertisement -

NASA's Perseverance Rover captures sound from Mars

నాసా హెలికాఫ్టర్ ఆడియో విడుదల

కేప్‌కెనవెరల్ (యుఎస్) : మొదట అంగారక గ్రహం తాలూకు అద్భుత దృశ్యాలను పంపిన నాసా అంగారక రోవర్ , శ్రుకవారం అంగారక గ్రహం సన్నని గాలి ఝాంకారాన్ని హెలికాప్టర్ మైక్రోఫోన్ ద్వారా గ్రహించి ఆ ఆడియోను పంపించ గలిగింది. ఈ ఝాంకారంతోపాటు హెలికాప్టర్ శబ్దం కూడా ఆడియోలో విడుదలైంది. పెర్సెవరెన్స్ రోవర్ పై ఉండే మైక్రోఫోన్ కన్నా 260 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ఎగిరింది. గాలి ఝాంకారంతోపాటు హెలికాప్టర్ చక్రం శబ్దం కూడా మైక్రోఫోన్ ద్వారా గ్రహించడమైంది. శుక్రవారం మధ్యాహ్నం 108 నిమిషాల పాటు హెలికాప్టర్ ప్రయోగాత్మకంగా ఎగిరింది. దక్షిణ దిశగా హెలికాప్టర్‌తోపాటు రోవర్ ప్రయాణించాయి. రోవర్ కొత్త వాయుక్షేత్రంలో ప్రవేశించగానే చాపర్ ఇదివరకటి ఎత్తు కన్నా రెట్టింపు ఎత్తులో ఎగర గలిగింది.

ఇదివరకు 33 అడుగుల ఎత్తులో ఎగిరినప్పుడు చిత్రాలను తీసి భూమికి పంపించింది. ఈ రెండు వాయుక్షేత్రాలు వేర్వేరుగా 423 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వారం రోజులకు ముందు నాలుగోసారి ప్రయోగాత్మకంగా గాలిలో హెలికాప్టర్ ఎగిరింది. అప్పుడు హెలికాప్టర్ చక్రం రేకుల శబ్దం కూడా రికార్డయింది. సాధారణంగా నిమిషానికి 2500 భ్రమణాల కన్నా ఎక్కువ భ్రమణాలను ఈ హెలికాప్టర్ చక్రం వల్ల జరుగుతుంది. ఇది భరించలేని శబ్దమైనప్పటికీ దోమ లేదా కీటకం ఎగిరినప్పుడు ఎంత చిన్నగా శబ్దం చేస్తాయో అంత చిన్నగా ఈ ఆడియోలో శబ్దం వినిపించింది. హెలికాప్టర్ చక్రం శబ్దాన్ని గాలి ఝాంకారాన్ని శాస్త్రవేత్తలు వేరు చేయగలిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News