అమరావతి: నాసిన్ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. పాలసముద్రం సమీపంలో నాసిన్ శిక్షణా కేంద్రాన్ని మోడీ ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్‌లో శిక్షణ ఇస్తామని, ప్రపంచ కస్టమ్స్ సంస్థ కూడా నాసిన్‌కు గుర్తింపు ఇచ్చిందని, నాసిన్ అతి త్వరలో అంతర్జాతీయ శిక్షణా కేంద్రంగా మారనుందని చెప్పారు. నాసిన్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం 500 ఎకరాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం, తాగునీటికి తగిన ఏర్పాటు చేశారని ప్రశంసించారు.
Watch: Smt @nsitharaman's address at the inauguration of National Academy of Customs, Indirect Taxes & Narcotics (@nacincbic) in Palasamudram, Andhra Pradesh.@PIB_India @FinMinIndia @cbic_india @pibvijayawada @MIB_India #PMatNACIN #ViksitBharathttps://t.co/HlRtqcjsdn
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) January 16, 2024