Thursday, January 23, 2025

కెటిఆర్‌ను అభినందించిన నాస్కామ్

- Advertisement -
- Advertisement -

కెటిఆర్‌ను అభినందించిన నాస్కామ్
ఐటి ఎగుమతుల్లో 31.44 వృద్ధి శాతం నమోదుపై నాస్కామ్ హర్షం
కెటిఆర్‌కు ట్విట్టర్‌లో అభినందించిన నాస్కామ్ అధ్యక్షురాలు
హైదరాబాద్: ఐటి ఎగుమతుల్లో తెలంగాణ 31.44 వృద్ధి శాతం నమోదుపై మంత్రి కెటిఆర్‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్టేర్ అండ్ సర్వీస్‌సె కంపెనీ (నాస్కామ్) ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ రెంటాల చంద్రశేఖర్‌లు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రతిగా మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్ (ఐటిఇఎస్) ఎగుమతులు 31.44 శాతం పెరిగి రూ. 2,41,275 కోట్లకు చేరుకుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.1,83,569 కోట్లుగా ఉన్నాయి. ‘2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటి/ ఐటిఇఎస్ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలను సాధించింది, ఇది రూ. 2,41,275 కోట్లకు చేరుకుంది.

ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 31.44 శాతం ఆశ్చర్యకరమైన వృద్ధిని సూచిస్తుంది‘ అని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 57,706 కోట్లు పెర గడం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదల అని వెల్లడించింది. తెలంగాణ వృద్ధిని కొనసాగించడమే కాకుండా జాతీయ సగటు వృద్ధిని అధిగమించి ఆ స్థానాన్ని పటిష్టం చేసిందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ నివేదికను విడుదల చేసిన అనంతరం తెలిపారు. తెలం గాణ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,27,594 కొత్త ఉద్యోగాలను జోడించింది, మొత్తం ఐటి/ఐటిఇఎస్ ఉద్యోగాల సంఖ్య 9,05,715కి చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 16.29 శాతం పెరుగుదలను సూచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News