Friday, January 10, 2025

క్రైమ్ నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామా

- Advertisement -
- Advertisement -

వై2కె సమస్య కారణంగా హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’. నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంట్‌‌‌రరపైజెస్ సమర్పణలో ఎ స్టూడియో, 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి.కె నిర్మించారు. ఈ చిత్రం అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, యంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటిటి ప్లాట్‌ఫాంలలో ఈ నెల 10న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ “ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా జీవితానికి గగ్గరగా ఉన్న కథ ‘నాతి చరామి’. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది”అని అన్నారు. చిత్ర దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ “అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ కృష్ణ, సందేశ్ బురి, జయశ్రీ రాచకొండ, రాజీవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News