Monday, December 23, 2024

దేశం సిఎం కెసిఆర్ వైపు చూస్తుంది

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: దేశం సిఎం కెసిఆర్ వైపు చూస్తుందని, దేశంలో మరేతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రమేష్ నగర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు బి.సదయ్య, ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు, సభ్యులు దుర్గాప్రసాద్, నామిండ్ల కుమార్, సుధాకర్ రావు, ఎల్లయ్య, రాజయ్యతోపాటు 40 మంది ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే చందర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సంక్షేమపాలనకు దేశ ప్రజలు ఆకర్షితులయ్యారని అన్నారు. కెసిఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భారత దేశంలో ఏ రాష్ట్రంలోకూడాలేవని, ప్రజా సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బిఆర్‌ఎస్ పార్టీలో చేస్తున్నారని అన్నారు. హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్‌ను గెలిపించుకోవడం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రకమంలోఓ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మెతుకు దేవరాజ్, చిట్టవేన వేణు, జాహిద్ పాషా, తోకల రమేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News