మాదాపూర్: నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఎసి)లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, పిఆర్‌సి లేకుండా అన్నాయం జరుగుతున్నా వారి సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని బిఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని (ఎన్‌ఎసి) న్యాక్‌లో గంగారం సంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంకు బండి రమేష్ ముఖ్య అతిథిగా హజరై పాల్గోన్నారు. అనంతరం న్యాక్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. బాలకృష్ణ, లోకేష్, అన్వర్, శ్రీనివాస్, భాస్కర్‌లు పలు సమస్యలను బండి రమేష్‌కు వివరించారు.
ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, పిఆర్‌సి లేకుండా అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, మాజీ మంత్రి నాయిని నరసింహరెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కాని న్యాక్‌లో రాష్ట్ర నలుమూలల నుంచి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, అన్ ఎంప్లాయిస్‌కు అకాడమిలో ట్రైనింగ్ ఇస్తాం. ఎలక్ట్రిషన్, ప్లంబర్, తాపీ మేస్త్రీ, వెల్డింగ్, కన్స్‌ట్రాక్షన్స్ ఫీల్డ్‌లో ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీస్‌కి ఉద్యోగం చేసేదానికి పంపిస్తామన్నారు. న్యాక్‌లో 350 మంది వర్కర్స్ హైదరాబాద్‌లో 150 మంది. మిగత జిల్లాలలో 200 మంది ఎంప్లాయిస్, ఉద్యోగం చేస్తున్నామన్నారు.
ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ వర్కర్స్‌కు చాలా ప్రాబ్లం ఉందని బండి రమేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన మాట్లాడుతూ న్యాక్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా న్యాక్‌లోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్య మంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పించటం గొప్ప విషయమన్నారు. న్యాక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరంకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్‌రావు, తెప్ప బాలరాజు, అంజాద్, అమ్ము , సలీం బాయ్, మున్నఆఫ్‌ఖాన్, సత్యరెడ్డి, సిల్వర్, మనీష్, కాకర్ల అరుణ, రవీందర్, సత్తయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.