Sunday, January 19, 2025

నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: తెలంగాణ నుండి దేశానికి సరిపడా క్రీడాకారులను అందించడమే లక్షంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్రీ డా పాలసీని రూపొందించామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యలు రంజిత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జూలై 2 నుండి 5వ తేది వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ను ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, హూప్ ఫౌండేషన్ చైర్మేన్, చీఫ్ పాట్రాన్ కొండా విజయ్‌కుమార్‌లతో క లిసి ఆయన ఆదివారం కార్యక్రమాన్ని ప్రా రంభించారు.

ఈ సందర్భంగా ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కప్‌ను ఘనంగా నిర్వహించామని, తెలంగాణ రాష్ట్రం నుండి క్రీడాకారుల ను అందిండమే లక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని రూపొందించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 వేల గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామని, దేశానికి రాష్ట్రానికి పేరు తెస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి విలువైన ప్రదేశాలలో ఇంటి స్థలాలను అందజేస్తున్నామని అ న్నారు. క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాల లో 2 శాతం ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మన ప్రాం తంలో 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని, తెలంగాణయ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1173 మంది క్రీడాకారులకు 39 కోట్ల, 16 లక్షల 34 వేల రూపాయలను క్రీడాశాఖ ద్వారా ప్రోత్సాహక నగదును అందించామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో 500మంది ప్రముఖులతో పాటు 100 మంది క్రీడా ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు.

ప్యారీస్‌లో నిర్వహిస్తున్న ఒలంపిక్ పోటీలతో పాటు, చిజ్రాయిల్ లో ని ర్వహించే జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్, చైనాలో నిర్వహించిన చేషియన్ గేమ్స్ కు జాతీయస్థాయి అక్వాటిక ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరిచిన స్విమ్మర్స్ ను ఎంపిక చేస్తారని, నాలుగు రోజుల పాటు నిర్వహించే చాంపియన్ షిప్ లో 42 ఈవెంట్లు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరి సమంతా రెడ్డి, జగదీష్ మరియు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News