Wednesday, January 22, 2025

జాతీయస్ధాయి ఆర్చరీ ఛాంపియన్ షిఫ్: తెలంగాణ నుంచి 24మంది ఎంపిక..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మార్చి నెలలో గుజరాత్ లో జరిగే జాతీయ స్ధాయి ఆర్చరీ ఛాంపియన్ షిఫ్ కి తెలంగాణ నుంచి 24 మంది ఆర్చీరీలు ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లా కోల్లురూలోని డీల్లి పబ్లిక్ స్కూల్ (డిపిఎస్) అవరణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్ధాయి 42వ సీనియర్ ఆర్చరీ ఛాంపీయన్ షిఫ్స్ పోటిలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ తరుపునా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిపిఎస్ ప్రిన్సిఫల్ సి.జె. వసంత హజరై, పోటిలను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్యార్ధుల్లో నెలకోన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి అసోసియేషన్స్ చేసే కృషికి తమ డిపిఎస్ ఎప్పుడు సంసిద్దంగా ఉంటుందన్నారు. మంచి విధ్యతో పాటు విధ్యార్ధులకు విలు విధ్యలో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవాలన్నారు. ఇటువంటి పోటిలకు తమ పాఠశాల వేదిక కావడం తమకు గర్వకారాణం అని వసంత తెలిపారు. ఈ ఛాంపియన్స్ సెలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 150 మంది ఆర్చర్స్ పాల్గోన్నారు. వీరి నుంచి బాల, బాలికల విభాగం నుంచి మూడు దశల్లో ఎంపిక చేసిన వారిని మార్చి నెలలో గుజరాత్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్ధాయి ఛాంపియన్ షిఫ్ లో పాల్గోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News