Sunday, December 22, 2024

జానీ మాస్టర్‌కు షాక్.. నేషనల్ అవార్డ్‌ను రద్దు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డు హోల్డ్ చేసినట్లు తెలిపింది.

నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ మాస్టర్ నేషనల్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ నెల 8న న్యూఢిల్లీలో నేషనల్ అవార్డుల ఫంక్షన్ జరగనుంది. దీంతో ఈ అవార్డును అందుకునేందుకు ఇటీవల బెయిల్ పిటిషన్ వేసిన జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు 5 రోజుల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. అయితే, ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో బెయిల్ మంజూరుపై సందిగ్ధత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News