Friday, November 8, 2024

అలంపూర్ జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

అలంపూర్ : అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుండి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ, వేద పండితులు వంకాయల శ్యాం కుమార్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. హిందుస్థాన్ గగస్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించారు. కాగా సంస్ధ యొక్క కార్యవర్గం సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న శక్తి పీఠాలను ప్రధానం చేశారు.

శ్రీ జోగులాంబ ఆలయాన్ని ప్రతిష్టాత్మక హిందూస్థాన్ గగస్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు 2022 దక్కడంపై తెలంగాణ రాష్ట్రంలోని భక్తులందరూ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ పరిస్థితులలో సైతం తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేస్తూ ఏ ఒక్క భక్తులు కూడా అనారోగ్య పరంగా గానీ, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలకు గానీ ఇబ్బందులు పడకుండా దేవస్థానం చక్కటి ఏర్పాట్లను నిర్వహించిందని కొనియాడారు. ఇటివల జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అనతి కాలంలో ప్రపంచ స్థాయిలో ప్రచారం కల్పించడంతో పాటు, వసతి గదులు, చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంకు కృషి చేశారని నిర్వాహకులు చిన్నస్వామితో పాటు కర్ణాటక మంత్రి సుధాకర్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News