Thursday, December 26, 2024

జాతీయ అవార్డులతో తెలుగు సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు

- Advertisement -
- Advertisement -

69వ జాతీయ అవార్డ్ విజేతలందరికీ అభినందనలు తెలిపారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఆయన మాట్లాడుతూ “జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ పొందిన అల్లు అర్జున్‌కి అభినందనలు. ఫస్ట్ టైమ్ ఒక తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం అల్లు అర్జున్‌కి, తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రేట్ మూమెంట్. జాతీయ అవార్డులు పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ అందరికీ పేరుపేరునా అభినందనలు.

రాజమౌళి ప్రతి సినిమాతో తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తున్నారు. అందుకు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. దేవీశ్రీ ప్రసాద్‌కి ప్రత్యేక అభినందనలు. దేవిశ్రీతో మాది గ్రేట్ జర్నీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశాం. పుష్ప సినిమాకి దేవిశ్రీకి నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. ఉప్పెన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు బుచ్చిబాబు, టీం అందరికీ అభినందనలు.

మొదటి సినిమాతోనే బుచ్చిబాబుకు, అలాగే ఫస్ట్ టైం మైత్రీ మూవీ మేకర్స్ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. కొండపొలం సినిమాలోని పాటకు అవార్డ్ పొందిన చంద్రబోస్‌కి అభినందనలు. మొన్ననే ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్ తీసుకోబోతున్నారు. తెలుగు సినిమాకి ఇన్ని అవార్డులు రావడం, ఇవాళ ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News